8:46 PM IST:
ముంబై వేదికగా నేటి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఎట్టకేలకు ముగిసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ వేలంలో తొలుత వేలానికి వచ్చిన ప్లేయర్ టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. ఆమెను బెంగళూరు రూ. 3.40 కోట్లతో దక్కించుకుంది. వేలంలోకి చివరగా వచ్చిన ప్లేయర్ సహానా పవార్. సహానా ను కూడా బెంగళూరే దక్కించుకోవడం గమనార్హం. ఆమెకు రూ. 10 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.
8:43 PM IST:
ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫి డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, జార్జియా వెర్హమ్, మన్షీ జోషి, హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, షబ్నమ్ షకీల్
8:43 PM IST:
స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, ఆష్ శోభన, కనిక అహుజా, డేన్ వన్ నీకర్క్, పూనమ్ ఖేమ్నర్, అశ్విన్ కుమారి, ప్రీతి బోస్, హెథర్ నైట్, మేగన్ షూట్, సహనా పవార్
8:42 PM IST:
హర్మన్‌ప్రీత్ కౌర్, నటాలీ స్కీవర్, అమిలియా కేర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లె వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సయికా ఇషాక్, హీలి మాథ్యూస్, హుమైరా కాజి, ప్రియాంక బాలా, చోల్ టైరన్, సోనమ్ యాదవ్, జింతిమని కలిత, నీలం బిష్త్
8:30 PM IST:
తొలి రెండు, మూడు సెట్ లలో ప్లేయర్లను కొనుగోలు చేయడంలో పెద్దగా ఆసక్తి చూపని ఢిల్లీ తర్వాత పుంజుకుంది. మార్కీ సెట్ ప్లేయర్లు ముగిసిన తర్వాత చకచకా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ వేలంలో ఢిల్లీ 18 మందిని దక్కించుకుంది.
జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, మరిజన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, తితాస్ సాధు, అలీస్ క్యాప్సీ, తారా నొరిస్, లారా హరీస్, మిన్ను మని, జైసా అక్తర్, అపర్ణా మండల్, స్నేహ్ దీప్తి, పూనమ్ యాదవ్, తాన్యా భాటియా, జెస్ జొనాసేన్, అరుందతి రెడ్డి
8:20 PM IST:
డబ్ల్యూపీఎల్ లో యూపీ పర్స్ ఖాళీ అయింది. ఆ టీమ్ ఖాతాలో మిగిలున్న రూ. 10 లక్షలను సిమ్రాన్ షేక్ ను కొనుగోలు చేసింది. పర్స్ ఖాళీ అయ్యాక యూపీ జట్టు ఇలా ఉంది.
సోఫియా ఎక్లిస్టోన్, షబ్నమ్ ఇస్మాయిల్, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, ఎలీస్సా హీలి, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, కిరణ్ నవ్‌గిరె, గ్రేస్ హరీస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, సిమ్రాన్ షేక్
నిబంధనల ప్రకారం ఒక జట్టు 15 నుంచి 18 మెంబర్స్ ను తీసుకోవచ్చు. వేలంలో యూపీ 16 మందిని కొనుగోలు చేసింది.
8:10 PM IST:
వెస్టిండీస్ సారథి హేలీ మాథ్యూస్ ను తొలి దశ వేలంలో పట్టించుకోని ఫ్రాంచైజీలు.. తుది దశలో మాత్రం ముంబై రూ. 40 లక్షలకు దక్కించుకుంది. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ హెథర్ నైట్ ను రూ. 40 లక్షలకు సొంతం చేసుకుంది. తాన్యా భాటియా రూ. 30 లక్షలకు ఢిల్లీ తరఫున ఆడనుంది. సుష్మా వర్మ ను రూ. 60 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది.
8:04 PM IST:
ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక ధర దక్కించుకున్న స్మృతి మంధాన (రూ. 3.40 కోట్లు) ఆర్సీబీకి సారథిగా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆర్సీబీ టీమ్ ఇదే.
స్మృతి మంధాన, సోఫీ డివైన్, పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, ఆష్ శోభన, కనిక అహుజా
8:01 PM IST:
మరో సెషన్ మిగిలిఉన్న వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్లే..
జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తితాస్ సాధు, అలీస్ క్యాప్సీ, తారా నొరిస్, లారా హరీస్, మిన్ను మని, జైసా అక్తర్
7:59 PM IST:
డబ్ల్యూపీఎల్ వేలంలో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ టీమ్ కు ఇప్పటివరకు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా..
ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫి డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, జార్జియా వెర్హమ్, మన్షీ జోషి, హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్
7:50 PM IST:
ఇప్పటివరకు ముగిసిన వేలంలో ముంబై కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే..
హర్మన్‌ప్రీత్ కౌర్, నటాలీ స్కీవర్, అమిలియా కేర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లె వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సయికా ఇషాక్
7:46 PM IST:
చివరి సెషన్ కంటే ముందు టీమ్ లు, వాటి వద్ద ఉన్న పర్స్ వాల్యూ, స్లాట్ల వివరాలు.. (నిబంధనల ప్రకారం జట్టులో కనీసం 15 మందిని, గరిష్టంగా 18 మందిని తీసుకోవచ్చు)
ఢిల్లీ క్యాపిటల్స్ : మిగిలిన పర్స్ రూ. 2.15 కోట్లు. మరో ముగ్గురిని తీసుకోవచ్చు.
గుజరాత్ : పర్స్ లో రూ. 1.30 కోట్లున్నాయి. ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్ ఉంది.
ముంబై : పర్స్ లో రూ. 1.30 కోట్లు మిగిలాయి. ఐదుగురిని తీసుకోవచ్చు.
ఆర్సీబీ : పర్స్ లో రూ. 1.95 కోట్లు ఉన్నాయి. నలుగురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంది.
యూపీ : పర్స్ లో రూ. 10 లక్షలు మాత్రమే ఉన్నాయి. 15 మందిని ఎంపిక చేసుకున్నారు.
7:38 PM IST:
డబ్ల్యూపీఎల్ లో యూపీ పర్స్ ఖాళీ అయింది. ఆ టీమ్ ఖాతాలో మరో రూ. 10 లక్షలు మాత్రమే మిగిలాయి. ఆ జట్టును ఓసారి పరిశీలిస్తే..
సోఫియా ఎక్లిస్టోన్, షబ్నమ్ ఇస్మాయిల్, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, ఎలీస్సా హీలి, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, కిరణ్ నవ్‌గిరె, గ్రేస్ హరీస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్
మిగిలి ఉన్న నగదు : రూ. 10 లక్షలు
మిగిలిన స్లాట్లు : 3
ఓవర్సీస్ స్లాట్లు : 0
7:33 PM IST:
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ప్రధాన ప్లేయర్ల వేలం ప్రక్రియ ముగియడంతో యాక్షనీర్ డబ్ల్యూపీఎల్ యాక్షన్ వేగం పెంచారు. 45 నిమిషాల విరామం తర్వాత సుమారు 150 మంది ప్లేయర్ల వేలం ముగిసింది. వీరిలో చాలా మంది అన్ సోల్డ్ గానే మిగిలారు. మిగిలిన వారిని మరో 15 నిమిషాల తర్వాత తుది దశ వేలంలో ముగించనున్నారు.
High Intensity 🚨!
Scenes from the #WPLAuction 👍
Which teams’ picks have impressed you the most so far? 🤔 pic.twitter.com/L4OVjOnpei
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
7:20 PM IST:
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో యూపీ వారియర్స్ పర్స్ ఖాళీ అయింది. ఇప్పటికే ఆ జట్టు 15 మందిని కొనుగోలు చేసింది. ఆ జట్టు వద్ద ఇంకా పది లక్షల రూపాయలు మాత్రమే మిగిలాయి. మిగిలిన రూ. 10 లక్షలలో ఆ జట్టు కొనుగోలు చేయాలనుకుంటే మరో ఒక ప్లేయర్ మాత్రమే దక్కనుంది.
7:11 PM IST:
ఆసక్తికరంగా సాగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు అన్ని టీమ్ ల వద్ద మిగిలి ఉన్న నగదు ఇదే..
ఢిల్లీ : రూ. 3.20 కోట్లు
ముంబై : రూ. 2,10 కోట్లు
గుజరాత్ :రూ. 1.50 కోట్లు
బెంగళూరు : రూ. 2.70 కోట్లు
యూపీ : రూ. 20 లక్షలు
7:07 PM IST:
టీమిండియా బ్యాటర్ అమన్ జ్యోత్ కౌర్ ను ముంబై ఇండియన్స్ రూ. 50 లక్షలకు దక్కించుకుంది. ఢిల్లీ పోటీపడ్డా విఫలమైంది.
7:06 PM IST:
టీమిండియా క్రికెటర్లు అనూజా పాటిల్ తో పాటు సిమ్రాన్ బహదూర్ లు అన్ సోల్డ్ లిస్ట్ లో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్ దేవికా వైద్య ను రూ. 1.40 కోట్లతో యూపీ వారియర్స్ టీమ్ దక్కించుకుంది. దేవికా కోసం యూపీ, ఢిల్లీలు పోటీ పడ్డాయి.
7:01 PM IST:
అలీస్ క్యాప్సీ ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షలకు దక్కించుకోగా ఇసాబెల్లె వాంగ్ ను ముంబై రూ. 30 లక్షలకు, మాన్సీ జోషిని గుజరాత్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్నాయి.
6:57 PM IST:
ఈ ఆసీస్ క్రికెటర్ కోసం గుజరాత్, బెంగళూరులు పోటీ పడ్డాయి. గుజరాత్ జెయింట్స్ జార్జియాను రూ. 75 లక్షలకు దక్కించుకుంది.
6:54 PM IST:
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రేస్ హరీస్ కోసం యూపీ, బెంగళూరు పోటీ పడ్డాయి. చివర్లో ఢిల్లీ కూడా పోటీలోకి వచ్చింది. చివరికి హరీస్ ను రూ. 75 లక్షలకు యూపీ సొంతం చేసుకుంది.
6:49 PM IST:
భారత మహిళా క్రికెటర్లు కిరణ్ నవగిరే ను యూపీ వారియర్స్ రూ. 30 లక్షలకు దక్కించుకుంది. ఆంధ్రా క్రికెటర్ సబ్బినేని మేఘన ను గుజరాత్ జెయింట్స్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది.
6:48 PM IST:
ఇప్పటివరకు ముగిసిన వేలంలో టాప్ బిడ్స్ దక్కించుకున్నది వీళ్లే..
– ఈ వేలంలో మొదటి పేరు దక్కిన స్మృతి మంధాన రూ. 3.40 కోట్లతో అందరిలోనూ టాప్ లో నిలిచింది.
– ఆమె తర్వాత భారత ఆటగాళ్లలో దీప్తి శర్మ .. రూ. 2.60 కోట్లతో సెకండ్ హయ్యస్ట్ బిడ్ గా ఉంది.
– విదేశీ ప్లేయర్లలో ఆష్లే గార్డ్‌నర్ రూ. 3.20 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆమె తర్వాత నటాలీ స్కీవర్ (రూ. 3.20 కోట్లు) తో ఆష్లేతో సమానంగా ఉంది.
6:43 PM IST:
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ప్రధాన ఆటగాళ్ల వేలం ముగిసింది. 45 నిమిషాల విరామం తర్వాత కొద్దిసేపట్లోనే మళ్లీ వేలం ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకూ వివిధ జట్లు 34 మంది క్రికెటర్లను దక్కించుకున్నాయి. వీరిని కొనుగోలు చేయడానికి అన్ని జట్లూ రూ. 43,75,00,000 (43 కోట్ల 75 లక్షలు) లు ఖర్చు చేశాయి. ఇవి పోగా ఏ ఏ జట్టు పర్స్ లో ఎంత నగదు ఉందో ఓసారి చూద్దాం.
ఢిల్లీ క్యాపిటల్స్ : రూ. 3.95 కోట్లు
గుజరాత్ జెయింట్స్ : రూ. 3.75 కోట్లు
ముంబై : రూ. 2.60 కోట్లు
బెంగళూరు : రూ. 3 కోట్లు
యూపీ వారియర్స్ : రూ. 2.95 కోట్లు
5:38 PM IST:
ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఇప్పటివరకు 9 సెట్లు ముగిశాయి. ఏ జట్టు ఎవరిని దక్కించుకుందో ఇక్కడ చూద్దాం.
ఆర్సీబీ : స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్
ముంబై : హర్మన్‌ప్రీత్, నటాలియా సీవర్, అమిలియా కెర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా
గుజరాత్ జెయింట్స్ : ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫీయా డంక్లీ, అన్నాబెల్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్
యూపీ వారియర్స్ : సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, తహీలా మెక్‌గ్రాత్, షబ్నమ్ ఇస్మాయిల్, ఎలీస్సా హేలీ, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్
ఢిల్లీ క్యాపిటల్స్ : జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, మరిజన్ కాప్, శిఖా పాండే, రాధా యాదవ్
From loud cheers to raw emotions! 👏 😊#TeamIndia is following the #WPLAuction closely & how! 👌 👌 pic.twitter.com/mfhNkla0Yn
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
5:27 PM IST:
టీమిండియా అండర్ – 19 మహిళల జట్టులో అదరగొట్టిన శ్వేతా సెహ్రావత్ కోసం ఢిల్లీ, గుజరాత్ పోటీ పడ్డాయి. శ్వేతాను రూ. 40 లక్షలతో యూపీ టీమ్ సొంతం చేసుకుంది.
5:25 PM IST:
ఇటీవలే అండర్ – 19 ప్రపంచకప్ లో అదరగొట్టిన అమ్మాయిలను ఫ్రాంచైజీలు పట్టించుకోవడం లేదు. గ్రేస్ స్క్రీవర్స్ (ఇంగ్లాండ్), అర్చనా దేవి (ఇండియా), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషలకు నిరాశే ఎదురైంది. కానీ తితాస్ సాధు ను ఢిల్లీ.. రూ. 25 లక్షలకు దక్కించుకుంది.
5:22 PM IST:
ఎమర్జింగ్ ప్లేయర్ల వేలం మొదలైంది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ హృషితా బసు, సౌమ్య తివారిలకు నిరాశ తప్పలేదు. స్పిన్నర్ పర్షవి చోప్రాను యూపీ వారియర్స్ రూ. 10 లక్షలకు దక్కించుకుంది.
5:18 PM IST:
టీమిండియా స్పిన్నర్ శిఖా పాండే కోసం గుజరాత్, ఢిల్లీ లు పోటీ పడ్డాయి. శిఖాను ఢిల్లీ రూ. 60 లక్షలకు సొంతం చేసుకుంది. మరో స్పిన్నర్ స్నేహ్ రాణా కోసం యూపీ, గుజరాత్ లు పోటీపడగా చివరికి ఆమెను రూ. 75 లక్షలతో తో గుజరాత్ దక్కించుకుంది. మరిజాన్ కాప్ కోసం ఢిల్లీ, బెంగళూరు పోటీపడగా ఢిల్లీ రూ.1.50 కోట్లతో సొంతం చేసుకుంది.
5:11 PM IST:
డబ్ల్యూపీఎల్ వేలంలో భాగంగా ఆల్ రౌండర్లు గ్రూప్ – 2 లో ప్రక్రియలో కూడా ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ముందుకురావడం లేదు. భారత స్పిన్నర్ రాధా యాదవ్ ను రూ. 40 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది.
4:50 PM IST:
స్పిన్నర్ల కేటగిరీలో చాలా మంది ప్లేయర్లు అమ్ముడుపోలేదు. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ తో పాటు ప్రధాన జట్ల స్పిన్నర్లు అందరూ అన్ సోల్డ్ గానే ఉన్నారు.
Afy Fletcher from West Indies and Fran Jones from New Zealand go UNSOLD #WPLAuction
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
Afy Fletcher from West Indies and Fran Jones from New Zealand go UNSOLD #WPLAuction
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
NO Bids for Poonam Yadav
She is UNSOLD #WPLAuction
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
4:43 PM IST:
స్పిన్ బౌలర్ల కేటగిరీలో ఇంగ్లాండ్ స్పిన్నర్ సారా గ్లెన్ ను ఎవరూ తీసుకోలేదు. భారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ను రూ. 40 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.
4:41 PM IST:
ఈ వేలంలోకి వచ్చిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్ జహనర అలమ్ కూడా అమ్ముడుపోలేదు. కివీస్ బౌలర్ లీ తహుహు కూ నిరాశ తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్ అయబొంగ ఖాఖ, విండీస్ బౌలర్ షకీర సల్మాన్ లు అమ్ముడుపోలేదు.
4:34 PM IST:
ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్, మిచెల్ స్టార్క్ భార్య ఎలీస్సా హేలీని యూపీ రూ. 70 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బెర్నాడిన్ కు నిరాశ తప్పలేదు.
4:30 PM IST:
టీమిండియా యువ వికెట్ కీపర్, లేడీ ధోనిగా పేరు దక్కించుకున్న రిచా ఘోష్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. బెంగళూరు, ఢిల్లీ లు పోటాపోటీకి దిగాయి. చివరికి ఆమెను బెంగళూరు రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకుంది.
RCB with another big buy!
▶️ https://t.co/58aRGIGYJD #WPLAuction pic.twitter.com/0CLIOw5OYz
— ESPNcricinfo (@ESPNcricinfo) February 13, 2023
4:25 PM IST:
టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్ యస్తికా భాటియా కోసం యూపీ, గుజరాత్, ముంబై పోటీ పడ్డాయి. యస్తికా చివరికి రూ. 1.50 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది.
4:22 PM IST:
వెస్టిండీస్ క్రికెటర్ డియాండ్రా డాటిన్ ను గుజరాత్ జెయింట్స్ రూ. 60 లక్షలకు టీమ్ కొనుగోలు చేసింది. భారత క్రికెటర్ తాన్యా భాటియా, శ్రీలంక వికెట్ కీపర్ అనుష్క సంజీవనిలను ఎవరూ కొనుగోలు చేయలేదు.
4:18 PM IST:
టీమిండియా ఆల్ రౌండర్ పూజా వస్త్రకార్ కోసం యూపీ, ముంబై పోటీ పడ్డాయి. చివరికి ఆమెను రూ. 1.90 కోట్లకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడనుంది.
4:15 PM IST:
టీమిండియా ఆల్ రౌండర్ హర్లీన్ డియోల్ ను గుజరాత్ జెయింట్స్ రూ. 40 లక్షలకు కొనుగోలు చేసింది.
4:14 PM IST:
శ్రీలంక సారథి చమారి ఆటపట్టును కొనుగోలు చేయడానికి వేలంలో ఏ జట్టూ ముందుకు రాలేదు.
4:12 PM IST:
ఇంగ్లాండ్ సారథి హీథర్ నైట్ ను దక్కించుకోవడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు. అన్నాబెల్ సదర్లాండ్ ను గుజరాత్ జెయింట్స్.. రూ. 70 లక్షలకు కొనుగులో చేసింది. దక్షిణాఫ్రికా క్రికెటర్ సునె లుస్ కూడా అమ్ముడుపోలేదు.
4:09 PM IST:
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ముంబై ఇండియన్స్ టీమ్ టీమిండియా సారథులను నమ్ముకుంది. ఇప్పటికే మెన్స్ ఐపీఎల్ లో ఆ జట్టు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టుకు సారథిగా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ ను కూడా దక్కించుకుంది.
🇮🇳 Leaders. Legends. Playing for #MumbaiIndians. 💙#OneFamily #AaliRe @ImRo45 @ImHarmanpreet pic.twitter.com/ZDs349TCbT
— Mumbai Indians (@mipaltan) February 13, 2023
4:02 PM IST:
డబ్ల్యూపీఎల్ వేలంలో ఇప్పటివరకు అత్యధిక ధర దక్కించుకున్న స్మృతి మంధాన.. తనకు రూ. 3.40 కోట్ల ధర దక్కిన తర్వాత ట్విటర్ వేదికగా స్పందించింది. ‘నమస్కార బెంగళూరు’అని ఆమె ట్వీట్ చేసింది. దానికి ఆర్సీబీ.. నమస్కార స్మృతి అని రిప్లే ఇచ్చింది.
Namaskara Smriti 🔥 https://t.co/Axaor5YHwc
— Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2023
Big celebration in team India as Smriti Mandhana goes to RCB at 3.40cr.pic.twitter.com/f3dDeMtQRZ
— SubashMV (@SubashMV5) February 13, 2023
3:57 PM IST:
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో భాగంగా ఇప్పటివరకు మార్కీ ప్లేయర్ల మూడు సెట్లు ముగిశాయి. ఇందులో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్లే..
స్మృతి మంధాన – రూ. 3.40 కోట్లు (బెంగళూరు)
నటాలీ సీవర్ – 3.20 కోట్లు (ముంబై)
ఆష్లే గార్డ్‌నర్ – రూ. 3.20 కోట్లు (గుజరాత్)
Base Price: INR 50 Lakh
Goes to @RCBTweets: INR 3.40 Crore
How about that for the first-ever Player Bid in the history of the #WPLAuction! 👏 👏 pic.twitter.com/TYo51Auiz4
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
దీప్తి శర్మ – 2.60 కోట్లు (యూపీ)
జెమీమా రోడ్రిగ్స్ – రూ. 2.20 కోట్లు (ఢిల్లీ)
షఫాలీ వర్మ – రూ. 2 కోట్లు (ఢిల్లీ)
.@JemiRodrigues joins @DelhiCapitals 👍 👍
Base Price: INR 50 Lakh
Goes for: INR 2.20 Crore#WPLAuction pic.twitter.com/Q1GReIjPei
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
3:49 PM IST:
ఇటీవలే ముగిసిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ లో భారత జట్టును నడిపించిన షఫాలీ వర్మ ఆటోనే కాదు వేలంలో కూడా తన దూకుడు చూపించింది. ఆమె కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. టీమిండియా మహిళల టీమ్ లో వీరేంద్ర సెహ్వాగ్ గా భావించే షఫాలీని రూ. 2 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.
3:45 PM IST:
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు సారథి మెగ్ లానింగ్ కోసం ముంబై, ఢిల్లీ పోటీ పడ్డాయి. ఆమెను రూ. 1.10 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
3:46 PM IST:
కివీస్ బ్యాటర్ సూజీ బేట్స్ ను కొనడానికి ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. టజ్మిన్ బ్రిట్స్ (సౌతాఫ్రికా) కు కూడా నిరాశ తప్పలేదు. సౌతాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ట్ కు కూడా నిరాశే ఎదురైంది.
3:42 PM IST:
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాక్ మధ్య ముగిసిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో అదరగొట్టి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన జెమీమా రోడ్రిగ్స్ వేలంలొ జోరు చూపించింది. జెమీమా కోసం యూపీ, ఢిల్లీ పోటీ పడ్డాయి. మధ్యలో ముంబై కూడ పోటీలోకి వచ్చింది. చివరికి ఆమెను ఢిల్లీ రూ. 2.20 కోట్లకు దక్కించుకుంది.
3:39 PM IST:
ఇంగ్లాండ్ బ్యాటర్ సోఫీయా డంక్లీ ని రూ. 60 కోట్లతో గుజరాత్ జెయింట్స్ చేజిక్కించుకుంది.
3:37 PM IST:
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ కోసం ముంబై, బెంగళూరు, ఢిల్లీ పోటీలోకి వచ్చాయి. చివరికి గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ. 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అమిలియా కేర్ ను రూ. 1 కోటితో ముంబై దక్కించుకుంది.
3:34 PM IST:
సౌతాఫ్రికా బ్యాటర్ షబ్నమ్ ఇస్మాయిల్ కోసం యూపీ, ఢిల్లీలు పోటీ పడ్డాయి. చివరికి ఆమెను రూ. 1 కోటికి యూపీ దక్కించుకుంది.
3:29 PM IST:
ఆస్ట్రేలియా బ్యాటర్ తహిలా మెక్‌గ్రాత్ కోసం ఢిల్లీ, గుజరాత్ లు పోటీలోకి వచ్చాయి. చివరికి ఆమెను యూపీ రూ. 1.40 కోట్లకు యూపీ దక్కించుకుంది.
3:26 PM IST:
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ నటాలీ సీవర్ కు కూడా వేలంలో ఊహించని ధర దక్కింది. ఈ ఇంగ్లీష్ క్రికెటర్ కోసం యూపీ, ముంబై పోటీపడ్డాయి. ఆఖరికి ఆమె రూ. 3.20 కోట్లకు ముంబై టీమ్ కే వెళ్లింది.
3:23 PM IST:
టీమిండియా యువ సంచలనం, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన పేసర్ రేణుకాసింగ్ ఠాకూర్ ను దక్కించుకోవడానికి కూడా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్ లు ఆమె కోసం వేలంలోకి వచ్చాయి. చివరికి రూ. 1.50 కోట్లకు బెంగళూరు ఆమెను దక్కించుకుంది.
3:21 PM IST:
రూ. 50 లక్షల కేటగిరీలో భాగంగా సెట్ – 2 ప్లేయర్ల వేలం మొదలైంది. ఈ కేటగిరీలో తొలుత వచ్చిన ప్లేయర్ టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ. దీప్తిని దక్కించుకోవడానికి గుజరాత్, ఢిల్లీలు పోటీ పడ్డాయి. మధ్యలో ముంబై, యూపీ వారియర్స్ కూడా పోటీలోకి వచ్చింది. చివరికి దీప్తిని రూ. 2. 60 కోట్లకు యూపీ దక్కించుకుంది.
3:12 PM IST:
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్ ను లక్నో (యూపీ వారియర్స్ ) రూ. 1.80 కోట్లకు దక్కించుకుంది. ఎక్లిస్టోన్ తర్వాత మార్కీ సెట్ – 1 ప్లేయర్ల యాక్షన్ ముగిసింది.
England’s All-rounder Sophie Ecclestone goes under the hammer next with a base price of INR 50 Lakh
She is SOLD to UP Warriorz for INR 1.8 crore 💰💰#WPLAuction
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
3:00 PM IST:
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ తో పాటు ప్రారంభ ఎడిషన్ నుంచి ఆడుతున్న ఆసీస్ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీని బెంగళూరు రూ. 1.70 కోట్లకు దక్కించుకుంది. పెర్రీ కోసం ఢిల్లీ, బెంగళూరు పోటీ పడ్డా చివరికి ఆర్సీబీనే పెర్రీని కొనుగోలు చేసింది.
2:58 PM IST:
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా ఉన్న గార్డ్‌నర్ ను దక్కించుకోవడానికి దాదాపు అన్ని టీమ్ లు పోటీ పడ్డాయి. ఈ రేసులో చివరికి గుజరాత్ జెయింట్స్ రూ. 3.20 కోట్లకు గార్డ్‌నర్ ను దక్కించుకుంది. అంతకుముందు విండీస్ ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్ ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు.
2:54 PM IST:
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్ ను బెంగళూరు రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది.
2:53 PM IST:
టీమిండియా మహిళల క్రికెట్ జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ వేలంలో జోరు చూపించింది. ఈ స్టార్ ఆల్ రౌండర్ ను దక్కించుకునేందుకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, లక్నోలు పోటీ పడ్డాయి. ఆఖరికి ముంబై రూ. 1.80 కోట్లకు దక్కించుకుంది.
2:50 PM IST:
డబ్ల్యూపీఎల్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తొలిసారి జరుగుతున్న ఈ సీజన్ లో భాగంగా నిర్వహిస్తున్న వేలంలో మంధాన.. వేలంలోకి వచ్చిన తొలి క్రీడాకారిణిగా అరుదైన ఘనతను దక్కించుకుంది. మంధానను దక్కించుకోవడానికి బెంగళూరు, ముంబైలు పోటీ పడ్డాయి. చివరికి ఆమెను బెంగళూరు రూ. 3.40 కోట్లకు దక్కించుకుంది.
2:46 PM IST:
ముంబైలోని జియో కన్వెన్షన్ కేంద్రంగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అట్టహాసంగా మొదలైంది. వేలానికి ఐదు టీమ్ (ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, ఢిల్లీ) లకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ సెక్రటరీ జై షా లు డబ్ల్యూపీఎల్ లోగోను విడుదల చేశారు.
𝗧𝗵𝗲 𝗛𝗶𝘀𝘁𝗼𝗿𝗶𝗰 𝗠𝗼𝗺𝗲𝗻𝘁 🙌 🙌
🎥 Presenting the Women’s Premier League (WPL) Logo 👏 👏#WPLAuction pic.twitter.com/zHxTZ1Pc6z
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
2:37 PM IST:
వేలంల పాల్గొనే 409 మంది ప్లేయర్లలో 246 మంది స్వదేశీ ప్లేయర్లు కాగా, 163 మంది విదేశీ ప్లేయర్లు… వేలంలో అమ్ముడయ్యే 90 మందిలో 30 మంది విదేశీ ప్లేయర్లు ఉంటారు…
2:36 PM IST:
మహిళా ప్రీమియర్ లీగ్ కోసం దాదాపు 1500 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోగా వీరిలో 409 మంది షార్ట్ లిస్టు చేయబడ్డారు. 409 మందిలో దాదాపు 90 మంది ప్లేయర్లు మాత్రమే వేలంలో అమ్ముడుపోనున్నారు…
.